బాలిక పట్ల వెకిలిగా ప్రవర్తించిన సేల్స్ మాన్ కు జైలుశిక్ష దేశ బహిష్కరణ
- May 29, 2017
దుబాయ్ : షాపునకు వచ్చిన కూతురి వయస్సు ఉన్న ఓ బాలిక పట్ల వికార చేష్టలు చేసిన ఓ భారతీయ సేల్స్ మాన్ చివరకి కారాగారంలో ఊచలు లెక్కపెట్టుకోవాల్సివచ్చింది. గత ఏడాది డిసెంబర్ లో సాయంత్రం 6 :30 సమయంలో దుబాయ్ లోని ఒక హైపర్మార్కెట్లో షాపింగ్ చేస్తున్న16 ఏళ్ళ కిశోర బాలిక పట్ల సేల్స్ మాన్ అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఉద్దేశ్యపూర్వకంగా ఆమె వద్దకు వచ్చి రెండుసార్లు ఆమెపై కావాలనే చేతులు వేసి తడుముతున్నట్లుగా నిర్ధారణ కావడంతో ఆ సేల్స్ మాన్ కు మూడు నెలలు జైలుశిక్షను విధించారు. పైత్యం ప్రకోపించి ..వయస్సు మరిచిన ఆ 41 ఏళ్ల భారతీయ సేల్స్ మాన్ షాప్ లో కొనేందుకువచ్చిన 16 ఏళ్ల వయస్సు బాలిక పట్ల వెకిలిచేష్టలు ప్రదర్శించాడు..తొలుత ఇతని వింత ప్రవర్తన అర్ధం కానీ ఆమె పెద్దగా పట్టించుకోలేదు..ఒక అల్మారా ముందునుంచి కావాలని వేగంగా దూకి వచ్చి ఒడుపుగా తాకడం జరిగింది అతని పట్టు నుంచి తప్పించుకున్న ఆ బాలిక ఆ ఘటన పొరబాటున జరిగిందేమోనని ఆ సేల్స్ మాన్ క్షమాపణ చెబుతాడేమోనని ఎదురుచూసింది. ఆ చర్యలు లేకపోగా ఎబ్బెట్టుగా నవ్వుతూ సైగలు చేయసాగేడు. పోయేకాలం దాపురించిన ఆ నడివయస్కుడు ఇంకోమారు ఆ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించేందుకు హైపర్‌మార్కెట్ ను విడిచిపెట్టి బైటకు వచ్చి బయట నిలబడి ఉన్న ఆమెకు ఒక గ్లాస్ పార్టిషన్ (గాజు విభజన) వెనుక నిలబడి అదే వెకిలి నవ్వుతూ సైగలు చేస్తున్నాడు. వళ్ళుమండిన ఆ బాలిక పోలీసులకు నీ గురించి పిర్యాదు చేస్తానని బెదిరించింది. దాంతో పైత్యం దిగిన ఆ సేల్స్ మాన్.... ఏమీ జరగనట్లు హైపెర్మార్కెట్లోకి అమాయకంగా తిరిగి వెళ్ళిపోయాడు..ఈ సంఘటన గురించి ఆమె తండ్రికి విలపిస్తూ తెలిపింది. ఈ విషయంను ఆ తండ్రి పోలీసులకు తెలియచేశాడు. దీనితో పోలీసులు సేల్స్ మాన్ ను అదుపులోనికి తీసుకొన్నారు.. మొదటి ఇన్‌స్టాన్స్ దుబాయ్ కోర్ట్, ఆ కిశోర బాలిక గోప్యతను భగ్నం చేయబోయినందుకు మరియు అత్యాచార యత్నానికి పాల్పడిన నేరానికి 41 ఏళ్ళ నిందితుడ్ని దోషిగా నిర్ధారించింది. ప్రతివాది ముందుగానే తన నేరాన్ని అంగీకరించాడు మరియు తాను పొరపాటున తాకడం జరిగిందని చెప్పుకున్నాడు. నిందితుడి మూడు నెలల జైలు శిక్ష పూర్తయిన తర్వాత ప్రతివాదిని దేశం నుంచి బహిష్కరించాలని న్యాయమూర్తి మొహమ్మద్ జమాల్ ఆదేశించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







