లండన్ లో కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలపై కాల్పులు
- May 29, 2017
లండన్: ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండే ఆ యువతి సాయుధుల చేతిలో ప్రాణాలుకోల్పోయింది. అప్పటి వరకు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ చల్లటి రాత్రిని ఆస్వాదిస్తూ అనూహ్యంగా మృత్యువాత పడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వాయవ్య లండన్‌లోని బ్రెంట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మోహనా అబ్దౌ అనే యువతిని అక్కడ అంతా మోంటాన అని పిలుస్తారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మోంటాన తమ ఇంటి పక్కనే ఉన్న చిన్నపిల్లలు ఆడుకునే క్రీడాస్థలానికి కొందరు స్నేహితురాళ్లతో కలిసి చేరుకుంది.
వారితో కలిసి చిన్నచిన్న సరదా ఆటలు ఆడుతోంది. అదే సమయంలో బైక్‌పై ముసుగుతో వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మొత్తం సమూహంపైకి కాల్పులు జరపగా మిగితా వారంత తప్పించుకోగా దురదృష్టం కొద్ది ఒక్క మోంటానకు మాత్రం ఒకే ఒక్క బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడి చనిపోయింది. అయితే, పోలీసులు మాత్రం ఆ కాలనీకి చెందినవారే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే, ఈ దాడికి దిగినవారు స్వయంగా లొంగిపోవడమో.. లేక తెలిసిన వారు నిజం బయటకు చెప్పడమో చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







