16న రానున్న'అవంతిక'

- May 29, 2017 , by Maagulf
16న రానున్న'అవంతిక'

శ్రీరాజ్‌ బల్ల దర్శకత్వంలో పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అవంతిక’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఆర్‌. ఫణిరాజ్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘భీమవరం టాకీస్‌లో వస్తోన్న 90వ చిత్రమిది. పూర్ణ నటిస్తున్న ఈ చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ‘అరుంధతి’, ‘అమ్మోరు’, ‘రాజుగారి గది’ తరహాలో గ్రాఫిక్స్‌తో కూడుకున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌ 16న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
గీతాంజలి, కొబ్బరిమెట్ట ఫేం శ్రీరాజ్‌, షియాజీ షిండే, షకలక శంకర్‌, ధనరాజ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ, పాటలు: భారతీబాబు, ఎడిటింగ్‌: శివ వై ప్రసాద్‌, సంగీతం: రవి బల్ల.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com