10 శాతం కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఇ-పేమెంట్స్‌ పెరుగుదల

- May 30, 2017 , by Maagulf
10 శాతం కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఇ-పేమెంట్స్‌ పెరుగుదల

మనామా: ఇంటీరియర్‌ మినిస్ట్రీ - కస్టమ్స్‌ ఎఫైర్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కస్టమ్స్‌ క్లియరెన్స్‌కి సంబంధించి ఇ-పేమెంట్‌ అప్లికేషన్‌ చెల్లింపులు 10 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఏప్రిల్‌ మరియు మే నెలలో ఈ వృద్ధి కనిపించింది. ఫాతీర్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా ఈ వృద్ధి నమోదైనట్లు గనాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌లో 2,587, మే నెలలో 2,826 పేమెంట్స్‌ జరిగాయి. వీటి మొత్తం 71,405, 77,176 బహ్రెయినీ దినార్స్‌. కస్టమ్స్‌ ఎఫైర్స్‌కి సంబంధించి పేపర్‌ వర్క్‌ మరియు సర్వీసుల్ని సులభతరం చేయడం వంటివి సత్ఫలితాలనిచ్చినట్లు ఈ గణాంకాల ప్రకారం వెల్లడయ్యింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com