బాంబుల నిర్వీర్యం కోసం డ్రోన్ల వినియోగం
- May 30, 2017
దుబాయ్: డ్రోన్లకు వాటర్ కెనాన్లు వినియోగించి, బాంబుల నిర్వీర్యం కోసం ఉపయోగిస్తామని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఇదంతా రిమోట్ పద్ధతిలో జరగనుంది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి ఓడన్ అండ్ వాటర్ కెనాన్ దుబాయ్ పోలీస్ - బాంబ్ స్క్వాడ్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. వారంట్ ఆఫీసర్ క్లాస్ 1 హమాద్ రషీద్ అల్ ఫెల్సాయ్ మరియు ఫస్ట్ సర్జంట్ మొహమ్మద్ సులైమాన్ అల్ బెలౌషి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. పది నిమిషాల పాటు ఈ డ్రోన్ వాటర్ కెనాన్ గాల్లో ఎగురుతుందని, ప్రపంచంలోనే ఈ విభాగంలో ఇది మొదటి ప్రయోగమని అల్ బెలౌషి చెప్పారు. బాంబుల్ని నిర్వీర్యం చేయడం కోసం కొత్త విధానాల గురించి ఆలోచిస్తున్నప్పుడు డ్రోన్లు గుర్తుకు వచ్చాయని అల్ ఫెలాసి చెప్పారు. బరువు కారణంగా మొదట్లో ప్రయోగాలు విఫలమయ్యాయనీ, పలు విధాలుగా పరిశోధించి సమర్థవంతంగా పనిచేసే వాటర్ కెనాన్ డ్రోన్లను తయారు చేశామని అల్ బెలౌషి వివరించారు. మేజర్ జనరల్ అల్ మెర్రి, ఈ కొత్త ఆవిష్కరణ నేపథ్యంలో అభినందలతో ముంచెత్తారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









