ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూత
- May 30, 2017
ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు దాసరి నారాయణరావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు కిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేసినా ప్రాణాలు దక్కలేదు. గతంలో సుదీర్ఘ కాలం పాటు దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది, తర్వాత డిశ్చార్జి కాగా, వారం రోజుల క్రితం మరోసారి ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయనకు మరోసారి వైద్యులు సర్జరీ చేశారు.
అయితే దాసరి శరీరంలోని పలు భాగాలకు ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి పూర్తిగా విషమించి కన్నుమూశారు. గతంలో ఆయనకు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత కొన్ని శరీర భాగాలు దెబ్బతిన్నాయి. అధిక రక్తపోటుతో దాసరి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు దక్కలేదు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









