ఐదేళ్ళ పైబడిన పిల్లలకు గుర్తింపు కార్డు
- October 09, 2015
ఒమన్‌లోని బహిష్కృత పిల్లలకు గుర్తింపు కార్డుని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఐదేళ్ళ పైబడినవారికి ఈ నివాసిత ధృవీకరణ గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైనవారు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసు అధికారులు వెల్లడించారు. 'ఇది పూర్తిగా ఐశ్ఛికం. ఐదేళ్ళు పైబడిన బహిష్కృత చిన్నారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రెండు వారాల క్రితం నిర్ణయించాం' అని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వివరించాయి. బహిష్కృతుల నివాసిత చట్టం ప్రకారం 15 ఏళ్ళ పైబడినవారికి నివాసిత గుర్తింపు కార్డు అత్యవసరమనీ, ఇప్పుడు 5 నుంచి 15 ఏళ్ళవారికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ అధికారులు చెప్పారు. తల్లిదండ్రులు అప్లికేషన్ పూర్తి చేయాలనీ, మిగతా ప్రాసెస్ అంతా సాధారణంగానే ఉంటుందనీ, పిల్లలు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందన్నారు అధికారులు. భారతదేశానికి చెందిన బాస్కీ దూతియా పిల్లలకు రెసిడెన్సీ గుర్తింపు కార్డు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తమ భద్రతకు ఈ గుర్తింపు కార్డు ఉపయోగపడ్తుందని వివిధ దేశాలకు చెందినవారు అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్టుల్లోనే కాకుండా ఆసుపత్రుల్లో, స్కూళ్ళలో ఈ గుర్తింపు కార్డుతో ఎంతో ప్రయోజనముందని వారు అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







