ఖతార్‌లో డ్రైవర్ లైసెన్స్ కష్టతరం
- October 09, 2015
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నవారికి ఇకపై డ్రైవర్ లైసెన్స్ కష్టతరం కానుంది. 35 మందికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తే, అందులో ముగ్గురో నలుగురో మాత్రమే పాస్ అవుతున్నట్లు అధికారులు చెప్పారు. పూర్తిస్థాయిలో డ్రైవింగ్ కోర్స్ తీసుకోకపోవడం వల్లే సమస్య వస్తోందని డ్రైవింగ్ స్కూల్ ప్రతినిథులు తెలిపారు. ఒక్కసారి ఫెయిల్ అయితే రెండు మూడు నెలలపాటు మరో టెస్ట్ కోసం వేచి చూడక తప్పదు. అయితే కొంచెం మార్పు ఇప్పుడిప్పుడే కనిపిస్తోందనీ 35 మంది టెస్ట్‌కి హాజరైతే 13 మంది లైసెన్స్ పొందగలుగుతున్నారని ఇంకో డ్రైవింగ్ స్కూల్ ప్రతినిథులు చెప్పారు. పోలీస్ తన పక్కనే కూర్చుని ఉంటే డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనడం కష్టమవుతోందని ఆసియాకి చెందిన ఓ వ్యక్తి చెప్పారు. హోటల్ సర్వీస్ వర్కర్లు, వెల్డర్లు, కుక్స్, గార్డెనర్స్, షూ మేకర్స్, సెక్యూరిటీ గార్డులు ఇతర తక్కువ ఆదాయం కలిగినవారు డ్రైవింగ్ కోర్స్‌కి అనర్హులుగా విధించిన నిబంధనతో సమస్య తలెత్తుతోందని ఇంకొందరు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







