స్పెయిన్‌అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటీ
- May 31, 2017
నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేడు స్పెయిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు మారియానో రజోయ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాద అణచివేత అజెండాగా ప్రధాని మోదీ.. రజోయ్‌తో చర్చలు జరిపారు. భారత్, స్పెయిన్‌పై ఉగ్రవాద ప్రభావం ఉందని, దానిపై పోరాడేందుకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని మోదీ కోరారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రజోయ్ నాయకత్వంలో స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. అంతేగాక, భారత్‌కు స్పెయిన్ అధిక ప్రాధాన్య దేశమన్నారు. ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధానికి కొత్త అర్థం వస్తుందని మోదీ పేర్కొన్నారు. 1988 తర్వాత స్పెయిన్‌లో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. పర్యటనలో భాగంగా.. స్పెయిన్ రాజు ఆరో ఫిలిప్‌ను కలవనున్నారు. బిజినెస్ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశంలోనూ మోదీ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









