దాసరి నారాయణరావు కోడలు సంచలన వ్యాఖ్యలు
- June 01, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన పెద్ద కోడలు సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి కన్నుమూసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో దాసరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను చూడటానికి వెళ్లానని, అప్పుడు తనను అనుమతించలేదని, తనను అనుమతించకపోవడంపైనా అనుమానాలున్నాయని ఆమె చెప్పారు. తన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నా తన భర్త నుంచి తాను ఇంకా విడాకులు తీసుకోలేదని తెలిపారు. తన మామగారు గతంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు. అంత ఆరోగ్యమైన మనిషి ఇంత హఠాత్తుగా ఎలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నెల 4న తాను మామగారి దగ్గరకు వెళ్లానని, ఆయన తనతో మంచిగా మాట్లాడారని చెప్పారు. తన కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ‘ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది. రెండు వారాలు ఆగి రండి. కూర్చుని మాట్లాడుకుందాం’ అని దాసరి తనకు చెప్పారని అన్నారు. తమకు దాసరి ఆస్తిలో భాగం ఏమీ ఇవ్వలేదని, తమకు తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన అన్నారని వివరించారు. తన మనవడిని దగ్గరకు తీసుకుంటానని దాసరి అన్నారని, ఇంతలోనే ఆయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని సుశీల చెప్పారు. ఆమె వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









