పనీర్‌, కాజుల బ్రెడ్‌

- June 02, 2017 , by Maagulf
పనీర్‌, కాజుల బ్రెడ్‌

కావలసిన పదార్థాలు : కోవా - 1 కప్పు, పనీర్‌ - 1 కప్పు, మైదా - అర కప్పు, బేకింగ్‌ సోడా - పావు టీ స్పూను, నూనె - తగినంత, పంచదార - 2 కప్పులు, నీరు - 2 కప్పులు, పాలు - 1 టేబుల్‌ స్పూను, యాలకుల పొడి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : పనీర్‌, మైదా, కోవా, బేకింగ్‌ సోడా ఒక ప్లేట్‌లో (పనీర్‌లోని తడి సరిపోకపోతే, కాస్త నీరుగానీ, పాలుగాని కలిపి) ముద్దలా చేసుకోవాలి. దీన్ని అరగంట నానబెట్టాలి. తర్వాత సమభాగాలుగా ఉండల్లా చేసుకొని చేత్తో వత్తి మధ్యలో జీడి పప్పు (పూర్తి గింజ) పెట్టి మూసేస్తూ దొండకాయ ఆకారంలో పేనుకోవాలి. తర్వాత నూనెలో సన్నని మంటపై దోరగా వేగించుకుని, పంచదార లేతపాకంలో 7 గంటలు ఉంచాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com