అంత్యక్రియల్లో వరుస బాంబు పేలుళ్లు.. 12మంది మృతి
- June 03, 2017
అఫ్గానిస్థాన్‌లో మళ్లీ రక్తపాతం జరిగింది. ఖేర్ ఖానా ప్రాంతంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతుండగా.. వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 12 మంది వరకూ చనిపోయినట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
ఇటీవల అఫ్గాన్‌లోని కాబూల్‌లో దౌత్యకార్యాలయాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 80 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు నిరసనగా.. శుక్రవారం కాబూల్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో సెనేటర్ ఎజద్యార్ కుమారుడు మృతిచెందాడు. శనివారం అతడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









