దర్శకరత్న దాసరి నారాయణరావు అంతిమ యాత్ర పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
- June 04, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు చనిపోయి రోజులు గడిచి పోతున్నా ఆ షాక్ నుండి ఆయన సన్నిహితులు మాత్రం ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ముఖ్యంగా మోహన్ బాబు ఈ షాక్ నుండి ఏమాత్రం తేరుకోలేదు అన్న అభిప్రాయం ఆయన మాటల వల్ల అర్ధం అవుతోంది. దాసరి అంతిమ యాత్రలో చిత్రసీమకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు పాల్గొనలేదనే విషయం పై ఇప్పటికే అనేక కామెంట్స్ వచ్చాయి.
ఒక్క వెంకటేష్ ను మినహాయిస్తే దాసరితో సినిమాలు చేసిన అనేకమంది ప్రముఖ హీరోలు హీరోయిన్స్ నటులు నిర్మాతలు కనీసం దాసరిని కడసారి చూడటం కోసం అంతిమ యాత్రకు రాకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ విషయమై ఎవరూ బహిరంగంగా కామెంట్ చేయకపోయినా మోహన్ బాబు మాత్రం తన అభిప్రాయాలను వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు.
దాసరి నుంచి సాయం పొంది, చివరి రోజున ఆయనను చూడటానికి కూడా రాని వాళ్లను విశ్వాస ఘాతకులుగా అభివర్ణించారు మోహన్ బాబు. దాసరి పాద ధూళి తగిలితే చాలు అని ఆయన పాదాల మీద పడ్డ వాళ్లు, ఆయన ద్వారా ఎంతో లబ్ధి పొందిన వాళ్లు దాసరిని కడసారి చూడటానికి రాకపోవడం విశ్వాస ఘాతుకం అంటూ పెద్దపెద్ద పదాలను వాడుతున్నాడు మోహన్ బాబు.
దాసరి బ్రతికి ఉన్న రోజులలో ప్రతిరోజు అను నిత్యం ఆయన పక్కన ఉన్న చాలామంది దాసరి చనిపోయిన తరువాత ఆయన ఇంటి వైపు కూడా రాకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రత్యేకించి కొంతమంది హీరోయిన్లు.. దాసరితో బోలెడన్ని సినిమాలు చేసి ప్రాముఖ్యత పొందిన వారు దాసరిని కడసారి చూడటం కోసం రాకపోవడం టాపిక్ ఆఫ్ డి టాలీవుడ్ గా మారింది. అయితే టాలీవుడ్ సినిమా రంగంలో వ్యక్తులను అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకుని ఆ తరువాత పూర్తిగా మరిచిపోయే సంస్కృతి మోహన్ బాబుకు తెలియదా ? అన్నదే సందేహం
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







