బ్రెజిల్ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సహాయంచేసే రోబో

- June 04, 2017 , by Maagulf
బ్రెజిల్ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సహాయంచేసే రోబో

విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి క్యూల్లో నిలబడే అవసరం ఇక గతం కానున్నది. ప్రయాణికులకు సహాయంచేసే చెక్‌ఇన్ రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. విమానాశ్రయాలకు ఐటీ, టెలికమ్యూనికేషన్ల సేవలందించే సీత కంపెనీకి చెందిన పరిశోధకులు ఈ రోబోను తయారుచేశారు. కేట్ కియోస్క్‌గా పిలువబడే ఈ రోబో స్వతంత్రంగాను, రోబోల బృందాలతో కలిసి కూడా పనిచేయగలదు. విమానం, ప్రయాణికుల రద్దీ సమాచారం సహాయంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాన్ని ఈ కియోస్క్ గుర్తిస్తుంది. తనిఖీ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఇబ్బందులుపడుతున్న ప్రయాణికులు ఉన్న మార్గంలో కదులుతుంది. చెక్‌ఇన్ కేంద్రాలు ఎక్కడున్నాయో వారికి తెలుపుతుంది. ప్రస్తుతం మూడు కియోస్క్‌లను తయారు చేశామని, అందులో ఒకదాన్ని త్వరలో భారత్‌కు పంపుతామని ఆ కంపెనీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com