భవనం పై దారుణం.. అత్యాచారానికి...హత్యకు గురైన 11 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు
- June 05, 2017
వళ్ళు తెలియని కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ పాకిస్తాన్ దుర్మార్గుడు ప్రకృతికి విరుద్ధంగా ఆడ మగ తేడా లేకుండా కామవాంఛలు తీర్చుకొన్నాడు. తన దేశానికి చెందిన ఓ 11 ఏళ్ళ బాలుడిపై లైంగిక దాడి చేసి కోరిక తీర్చుకొని ఆపై ప్రాణాలు తీసాడు. అబుదాబి పోలీసు డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తూ అల్ షరీఫీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాలుడు కనిపించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో, గత శనివారం బాలుడి మృతదేహం ఓ భవనంపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. భవనం యొక్క పైకప్పు మీద ఆ 11 ఏళ్ల బాలుడు లైంగికంగా అత్యాచారానికి గురై మరణించినట్లు పోలీసుల నేర పరిశోధనలలో తేలింది. ఆజాన్ మజిద్ గా గుర్తించబడిన ఆ బాలుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్1వ తేదీన ప్రార్థన చేయటానికి దగ్గరలో ఉన్న మసీదు వద్దకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ బాలుడు అనూహ్యంగా ఎవరికి కనిపించకుండాపోయాడు.మరుసటిరోజు మురోర్ రోడ్లో ఉన్నతమ భవనంపై బాలుని మృతదేహం ఉన్నట్లు బంధువులు పేర్కొన్నారు. ఈ హత్య కేసులో పోలీసులు చురుకైన పరిశోధన జరిపి నిందితుడిని పట్టుకొన్నారు. ఆ హత్య లో తన ప్రమేయం ఉందని పోలీసుల ఎదుట పాకిస్థాన్ నిందితుడు ఒప్పుకున్నాడు. తాను ఆ బాలుడిని ఓ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశానని . అనంతరం తన నేరం వెలుగు లోనికి రాకుండా ఉండేందుకు ఆ బాలుడికి ఊపిరాడకుండా చేసి గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకున్నాడు. బాలుడు అజాన్ మాజిద్ తండ్రి సైతం ఒక పాకిస్తానీ జాతీయుడు, స్వదేశీయుడే తన బిడ్డని దారుణంగా అత్యాచారం చేసి హతమార్చాడని విలపిస్తున్నాడు. గల్ఫ్‌దేశాల్లో నివసిస్తున్న కొందరు పాకిస్తాన్ పౌరులు ఇటీవల అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ఆయా దేశాల్లో నమోదవుతున్న నేరాల్లో పాకిస్తానీయుల సంఖ్య అధికంగా ఉంటోంది. ముఖ్యంగా బాలికలు, బాలురపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని పలు కేసులలో ఆ విషయం నిర్ధారణ అవుతుంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకి తరలించారు.ఈ సంఘటనపై మరింత సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాలుడి హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడంలో అబుదాబి పోలీసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ శాఖ చేసిన ప్రయత్నాలపై పలువురి ప్రశంసలు లభించాయి. ఈ ఘటనతో ఆరోగ్యభీమా సంస్థలో ఉద్యోగిగా పనిచేసే బాలుని తండ్రి మజిద్ తీవ్ర విషాదం లో మునిగిపోయి ఉన్నాడు. ఆయనకు స్నేహితులు మరియు బంధువులు మద్దతునిచ్చారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









