జియోనీ మొబైల్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరో ప్రభాస్
- June 06, 2017
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ ను బాహుబలి కి ముందు.... బహుబలికి తర్వాత అని చెప్పవచ్చు.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు ఉన్న క్రేజ్.. రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ ను తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని చాలా సంస్థలు కోరుకొంటున్నాయి.. కానీ ప్రభాస్ మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.. తాజాగా ప్రభాస్ ఓ మొబైల్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా అంగీకరించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
ప్రభాస్ ను జియోనీ మొబైల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం చేసుకొన్నట్లు మొబైల్ తయారీ సంస్థ జియోనీ ఇండియా ప్రకటించింది.. ప్రభాస్ తమ మొబైల్స్ కు ప్రచారం నిర్వహిస్తే.. తమకు ప్లస్ అవుతుందని.. తమకు ఇప్పటికే కోటి పాతిక లక్షల మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు జియోనీ సంస్థ తెలిపింది. కాగా ఈ సంస్థకు ఇప్పటికే విరాట్ కోహ్లీ, అలియాభట్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ లు ప్రచారకర్తలుగా ఉన్నారు.. అయినా సరే ప్రభాస్ తో అగ్రిమెంట్ తో ఇండియాలో తమ మొబైల్స్ కు మరింత ఆదరణ పెరుగుతుంది అని ఈ కంపెనీ వర్గాల వారు అంటున్నారు.. ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో సినిమా చేస్తున్న సంగతి విధితమే.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









