2016 నుండి అమలులోకి రానున్న కువైట్ న్యూ లేబర్ లా – నూతన ప్రయోజనాలు

- October 10, 2015 , by Maagulf
2016 నుండి అమలులోకి రానున్న కువైట్ న్యూ లేబర్ లా – నూతన ప్రయోజనాలు

కువైట్ లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలతో రూపొందించబడిన కువైట్ నూతన శ్రామిక చట్టం 2016 నుండి అమలులోకి రానున్నది. ఈ నూతన చట్టం వలన ఉద్యోగులు పొందే ప్రయోజనాల వివరాలలోకి వెళ్తే..

* ఉద్యోగ కాంట్రాక్టు మొదలైన 9 నెలల తర్వాత 30 రోజుల యానువల్ హాలిడేస్ ను, కాంట్రాక్టు పూర్తయిన తర్వాత ఉచిత ఫ్లైట్ టికెట్ ను ఇవ్వవలెను
* ఉద్యోగికి, యజమానికి మధ్య సత్సంబంధాలను క్రమబద్దీకరించి, ఇరువర్గాలకు సంబంధించిన అన్నీ హక్కులకు తగిన హామీ ఇవ్వడమే కువైట్ నూతన శ్రామిక చట్టం సారాంశం అని ఒక పత్రిక పేర్కొన్నది.
* నూతన చట్టం ప్రకారం ఉద్యోగి తన  యానువల్ హాలిడేస్ ను 2 సంవత్సరాల వరకు వాయిదా వేసుకునే అనుమతిని, యజమాని నుండి ఉద్యోగికి చేకూరవలసిన అన్నీ రకాల ప్రయోజనాలను ఆలస్యం లేకుండా పొందవచ్చును.
* ఉద్యోగికి 100 రోజుల ప్రొబేషన్ పీరియడ్ ను ఏర్పాటు చేసి, ఆ ఉద్యోగి అర్హతను, పనితనాన్ని బట్టి, యజమాని జాబ్ కాంట్రాక్టు పీరియడ్ ను ఖచ్చితంగా నిర్ణయించుకునే అవకాశాన్ని ఇస్తుంది.

 

--శాలెం బాబు (అడ్వకేట్,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com