తెలంగాణా రాష్ట్రంలో మూడో విడత హరిత హారం

- June 06, 2017 , by Maagulf
తెలంగాణా రాష్ట్రంలో మూడో విడత హరిత హారం

తెలంగాణాలో మూడో విడత హరిత హారానికి రంగం సిద్ధమవుతోంది.  ఈసారి 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ పరిధిలో 2 కోట్ల 10 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు.  ఈసారి పెద్ద ఎత్తున పండ్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు.  ముఖ్యంగా ఉసిరి, నేరేడు, మేడి, పనస,జామ మొక్కలతో పాటు తాటి, ఈత, టేకు చెట్లను పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల మేర మూడో విడత హరితహారం చేపట్టనున్నారు.  అలాగే సీడ్ బాంబింగ్ పేరిట మట్టి, విత్తనాలు కలిపి తయారు చేసిన విత్తన బంతులను గుట్టల్లో చల్లనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com