హెయిల్ ఎడారిలో100 మంది కార్మికులను వదలిపెట్టిన యజమాని
- June 06, 2017
బతుకు తెరువు కోసం ఎడారి దేశం వచ్చినందుకు...ఓ మనస్సు లేని యజమాని తనను నమ్ముకొన్న కార్మికులను ఎడారి పాల్జేశాడు.. వివరాలలోకి వెళితే, ఒక నిర్మాణ సంస్థకు చెందిన దాదాపు 100 మంది నిర్వాసితులైన కార్మికులను వారి యజమాని సెంట్రల్ సౌదీ అరేబియాలో హెయిల్ ఎడారిలో వారిని విడిచిపెట్టారని ఆ బాధితులు ఆరోపిస్తున్నారు.ఆ యజమాని ఏడు నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వకపోగా ...గత రెండు నెలలుగా ఆహారం, నీరు, ఇతర ప్రాధమిక అవసరాలు కూడా అందివ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్, యెమెన్ల నుంచి 96 మంది కార్మికులను డమ్మామ్ ఆధారిత కంపెనీ నియమించుకొంది.రాష్ట్ర రాజధాని హెయిల్ కు దాదాపు 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న బఘాలోని అడోబియ గ్రామంలోని రహదారి నిర్మించేందుకు కార్మికులను వినియోగించనుంది. సంస్థ యొక్క ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతున్న తీరుని అంచనా వేసిన కొంతమంది కార్మికులు ఈ స్థలంను విడిచిపెట్ పారిపోయారు. ప్రస్తుతం, సుమారు 60 మంది కార్మికులు మాత్రమే సంస్థను నమ్ముకొని మారుమూల ప్రాంతమైన ఎడారి శిబిరంలో ఉన్నారు. ఇక్కడ నుంచి అంత సులభంగా వేరే ఇతరులతో కలిసే వీలుండదు. చాలామంది కార్మికులు భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చారు. "ఈ సుదూర ఎడారి స్థలం నుండి బయటికి వెళ్లడం అసాధ్యం. ఇక్కడి నుంచి ఎటువంటి రవాణా అందుబాటులో ఉండదని భారతదేశం లోని ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ నుండి వచ్చిన హరిహార్ తెలిపారు. . కంపెనీ గత ఏడు నెలలుగా జీతాలు చెల్లించటం నిలిపివేసింది. గత రెండు నెలలుగా ఆహారం , నీరు పూర్తిగా ఇవ్వడం మానివేసిందని, దీంతో కార్మికులు ఆహారం కోసం పోరాడుతూ ఉండగా, మరియు నీరు, , హెయిల్ లో ఒక కమ్యూనిటీ వర్కర్ సర్ఫుద్దీన్ తయ్యిల్ శనివారం సాయంత్రం ఎడారి శిబిరంలో కార్మికులు సందర్శించడం తరువాత, సాధారణ అమ్నెస్టీ ఉపయోగం ద్వారా వారి సొంత దేశాలకు తిరిగి పంపేందుకు కృషి చేయనున్నట్లు ఆయన " మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఆయన తెలిపారు. కార్మికుల రెసిడెన్సీ అనుమతి గడువు ముగిసిన కార్మికుల వివరాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తుంటే వారి యజమాని తన మొబైల్ ఫోన్ ఆపివేసినట్లు ఆయన పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







