శాఖాహారుల్లో క్యాన్సర్ రావడానికి అవకాశాలు చాలా తక్కువ
- October 11, 2015
శాఖాహారుల్లో క్యాన్సర్ రావడానికి అవకాశాలు చాలా తక్కువ. వెజిటేరియన్ గా మారితే.. ముందుగా మీకు కలిగే.. పెద్ద ఆరోగ్య సంపద ఇది. కాబట్టి కనీసం ఈ అక్టోబర్ నెలంతా వెజిటేరియన్లుగా మారిపోండి. ఎవరైతే శాఖాహారులుగా ఉంటారో వాళ్లు ఖచ్చితంగా ఎక్కువకాలం సంతోషంగా బతుకుతారు. ఎందుకంటే.. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి.. ఎక్కువకాలం జీవిస్తారు. వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్లకు సెక్స్ లైఫ్ బావుంటుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహారం తినేవాళ్లకంటే.. శాఖాహారులు స్లిమ్ గా ఉంటారని ఎప్పుడైనా గ్రహించారా ? నిజమే.. వెజిటేరియన్ ఫుడ్ లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందుకే.. వెజిటేరియన్ కు అలవాటు పడితే.. బరువు కూడా తగ్గిపోయి.. స్లిమ్ గా కనిపిస్తారు. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తప్రసరణ సరిగా జరిగి.. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కూరగాయల్లో ఐరన్, పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చు. శాఖాహారం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ గా ఉంటుంది. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తపోటు అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మధుమేహం రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే.. శాఖాహారం ఆరోగ్యానికి మంచిది. గుండె, ఊపిరితిత్తులు వంటి అన్ని అవయవాల పనితీరు సక్రమంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం మంచిది. కూరగాయల్లో ఎక్కువ మోతాదులో పోషకాలుంటాయి. నాన్ వెజ్ తో పోల్చితే.. ఇందులో ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషకాలు మెండుగా ఉంటాయి. ఇన్ని ఆరోగ్య సూత్రాలు చెబుతున్న వెజిటేరియన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు కదూ. అందుకే.. ఈ అక్టోబర్ నెలంతా.. మీరు వెజిటేరియన్లుగా మారిపోయి ఆరోగ్యంగా జీవించండి.. గుడ్ లక్..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







