నందమూరి కల్యాణ్‌రామ్ చిత్రం 'షేర్' ఆడియో వేడుక
- October 11, 2015
నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహన్ జంటగా నటిస్తున్న చిత్రం 'షేర్'. మల్లికార్జున్ దర్శకుడు. కొమర వెంకటేశ్ నిర్మాత. ఎస్.ఎస్.తమన్ స్వరాలందించారు. శనివారం హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. బిగ్ సీడీని ఎన్టీఆర్ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను నందమూరి రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ''మల్లికి మూడో సినిమా అవకాశం ఎందుకిచ్చావని చాలామంది అడిగారు. నేను కథను, మంచి టెక్నిషియన్లను నమ్ముతాను. మేమి ద్దరం రెండు సినిమాలు చేశాం. మొదటి సినిమా కన్నా రెండో సినిమా బెటర్‌గా వచ్చింది. ఇది మూడో సినిమా. షేర్ సక్సెస్ మల్లికి చాలా అవసరం. ఈ సినిమా సక్సెస్ నాది కాదు. సక్సెస్, ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి. నేను కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాను. సక్సెస్ వచ్చే సరికి అవేమీ కనిపించవు. నా వల్ల సినిమా కాస్త డిలే అయింది. అయినా మా నిర్మాత నవ్వుతూ ముందుకి తీసుకెళ్లారు. మల్లికి హిట్ పడితే ఇండసీ్ట్రలో మంచి టెక్నిషియన్ నిలబడతాడు. అభిమానులకు ఎప్పటినుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేమంతా ఎన్టీఆర్ అనే వృక్షం నుంచి వచ్చినవాళ్లం. ఆయన్నుంచి నాన్న, బాబాయ్, తర్వాత మేమంతా వచ్చాం. మా తర్వాతి తరమైన మోక్షజ్ఞ, అభయ్, మా అబ్బాయి కూడా రావచ్చు. తాతగారే మా అంద రికీ స్ఫూర్తి. దయ చేసి మమ్మ ల్ని వేరు చేసి మాట్లాడకండి'' అని అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ''అన్నయ్య మాట్లాడిన తర్వాత ఏం చెప్పాల్లో తెలియట్లేదు. ఆయన మాటలే నా మాటలు. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎంత ఇంఫాక్ట్ ఇచ్చామనేది ముఖ్యం. అన్నయ్యతో మల్లికి మూడో సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. 'నాన్నకు ప్రేమతో' షూటింగ్ గ్యాప్‌లో ఓసారి ఇండియాకు వచ్చాను. 'కిక్ 2' సినిమా ఆర్థిక ఇబ్బందులో ఉందనీ, అందుకే ఎన్టీఆర్ షూటింగ్ వదిలి ఏదో సంతకాలు పెట్టడానికి హైదరాబాద్ వచ్చాడనీ మీడియాలో కథనాలు వచ్చాయి.. అవన్నీ వాస ్తవాలు కాదు. కల్యాణ్‌రామ్ అన్నయ్య చెయ్యి ఎప్పుడూ పైనే ఉం టుంది. అది మా అమ్మానాన్నలు మాకు నేర్పిన సంస్కారం'' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''కల్యాణ్‌రామ్‌తో 12 ఏళ్ల జర్నీ నాది. ఈ 12 ఏళ్ళల్లో ఓ వ్యక్తి నా మీద ఉంచిన నమ్మకమే ఈ సినిమా. నమ్మకం తప్పకుండా నిలబడుతుంది. వెంకటేశ్ లాంటి గట్స్ ఉన్న నిర్మాత అవసరం ఇండస్ట్రీకి ఎంత్తైనా ఉంది. తమన్ చక్కని పాటలు ఇచ్చాడు. నేపథ్య సంగీతం అదిరిపోయింది'' అని అన్నారు. ''నిర్మాతగా తొలి చిత్రం నందమూరి హీరోతో చెయ్యడం ఆనందంగా ఉంది'' అని కొమర వెంకటేశ్ తెలిపారు. ''మల్లి దర్శకుడిగా కన్నా మంచి మిత్రుడు నాకు. చక్కని ట్యూన్ రాబట్టుకున్నాడు. ఈ ఆల్భమ్‌లో 'నయినా' సాంగ్ అంటే చాలా ఇష్టం. పాటలు అందరికీ నచ్చుతాయి'' అని తమన్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







