కేరళ రొయ్యల పచ్చడి
- June 06, 2017
కావాల్సిన పదార్థాలు: రొయ్యలు - పావు కిలో, ఉప్పు - 2 టీస్పూన్లు, కారం - 4 టీస్పూన్లు, పసుపు - 1 టీస్పూను, అల్లం - 60 గ్రాములు, వెల్లుల్లి -60 గ్రాములు, పచ్చిమిర్చి - 10, వినెగర్ - పావు కప్పు, నువ్వుల నూనె - 1 కప్పు.
మసాలా పొడి కోసం:
ఉప్పు - ఒకటిన్నర టీస్పూను, గరం మసాలా - 1 టీస్పూను, కారం - 1 టేబుల్‌స్పూను, మిరియాల పొడి - 2 టీస్పూన్లు, పసుపు - 2 టీస్పూన్లు (వీటన్నిటినీ కలిపి పెట్టుకోవాలి).
తయారీ: రొయ్యల్లో 2 టీస్పూన్ల ఉప్పు, పసుపు వేసి అరగంట నానబెట్టాలి. తర్వాత రొయ్యల్లో ఊరిన నీటిని వంపేయాలి. బాండీలో అర కప్పు నూనె వేసి కాగాక రొయ్యలు, కారం వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద 5 నిమిషాలు వేగించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత బాండీలో నుంచి తీసి వేరే గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి కలిపి మరీ మెత్తగా కాకుండా మధ్యస్తంగా రుబ్బుకోవాలి. అదే బాండీలో మిగతా నూనె పోసి అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి చిన్న మంట మీద పచ్చి వాసన పోయేవరకూ వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, మసాలా పొడి, ఉప్పు కూడా వేసి ఓ నిమిషంపాటు వేగించాలి. వేగించి పెట్టుకున్న రొయ్యలు వేసి, పావు కప్పు వెనిగర్ పోసి కలపాలి. చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి.
పచ్చడి పొడిగా తయారై నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి చల్లారబెట్టాలి. పూర్తిగా చల్లారాక పొడిగా ఉన్న జాడీలో నింపుకోవాలి.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







