ఫ్రెండ్ సినిమా కి తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ సపోర్ట్

- June 06, 2017 , by Maagulf
ఫ్రెండ్ సినిమా కి తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ సపోర్ట్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ తన బాల్య మిత్రుడు తీసిన సినిమాకి తనవంతు సాయం అందించారు. సాయి రోనక్‌, హరీష్‌ కల్యాణ్‌, పూజ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'కాదలి'. పట్టాభి ఆర్‌. చిలుకూరి దర్శకుడు. ఈయన కేటీఆర్ కు బాల్య మిత్రుడు. ఈ సినిమా ఆడియో వేడులకు కేటీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. లాగే రామ్ చరణ్ ని కూడా తీసుకొచ్చారు.
ఈ సందర్భముగా కెటీఆర్ మాట్లాడుతూ.. 'పట్టాభి నా బాల్యమిత్రుడు. ఆయన ప్రయత్నం విజయవంతం కావాలి. కొత్తవాళ్లతో సినిమాలు తీసినప్పుడు కొత్త తరహా కథలతో రావాలి. ప్రేక్షకులకు కనువిందు చేసేవిధంగా సినిమాని తీర్చిదిద్దాలి. ఈ లక్షణాలు 'కాదలి'లో కనిపిస్తున్నాయి. ఈమధ్య విషయం ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 'పెళ్లి చూపులు' అందుకు చక్కటి ఉదాహరణ. ఈ సినిమా కూడా 'పెళ్లి చూపులు' స్థాయిలో విజయవంతం అవ్వాలి." అని కోరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com