సముద్రంలో కూలిన విమానం...

- June 07, 2017 , by Maagulf
సముద్రంలో కూలిన విమానం...

మయన్మార్‌ సైనిక విమానం అండమాన్ సముద్రంలో కుప్పకూలింది. అందులోవున్న 116 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1.35 గంటలకు యాంగూన్ - మీక్ మధ్య వెళ్తూ కనిపించకుండా పోయింది. దావై సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. 11 మంది క్రూమెంబర్స్‌తోపాటు 105 మంది ప్రయాణీకులున్నారు.
విమాన శకలాలను నౌకాదళ అధికారులు గుర్తించారు. విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని సమాచారం. ఇందుకోసం ఓడలు, విమానాలను రంగంలోకి దించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com