మాజీ ప్రధానిగా బాలీవుడ్ నటుడు అనుపమ్‌

- June 07, 2017 , by Maagulf
మాజీ ప్రధానిగా బాలీవుడ్ నటుడు అనుపమ్‌

భా రత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’. ఇందులో మన్మోహన్‌ సింగ్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. చిత్ర దర్శకుడు విజయ్‌ రత్నాకర్‌ గుట్టే మాట్లాడుతూ ‘‘కథను పూర్తి నిజాయతీగా తెరకెక్కించాను. ఈ కథలోని పాత్రకు ఎంతో పరిపక్వత ఉన్న నటుడు కావాలి. అలాంట నటుడు అనుపమ్‌ఖేర్‌ రూపంలో దొరికార’’న్నారు. ‘‘ఓ ప్రముఖ వ్యక్తి జీవిత కథలో నటిస్తుంటే పోలికలు సహజం. ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. ఇలాంటి సవాళ్లు నా తొలి చిత్రం నుంచే నాకు అలవాటు. మన్మోహన్‌సింగ్‌గా వెండితెరపై నన్ను నేను చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’అని చెప్పారు అనుపమ్‌ఖేర్‌. మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు సంజయ్‌బారు రాసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌: ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌ సింగ్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com