భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

- June 08, 2017 , by Maagulf
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా పడిపోయింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.195 తగ్గి రూ.29,600లకు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో బంగారం ధర తగ్గిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.150 తగ్గడం ద్వారా రూ.40,750కు చేరింది. పరిశ్రమల వర్గాల నుంచి డిమాండ్‌ లేకపోవడం, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.10శాతం తగ్గి 1,285.50 అమెరికన్‌ డాలర్లు పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com