ప్రధాని మోదీతో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భేటీ
- June 09, 2017
భారత్, పాక్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసు.. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటుతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కజకిస్థాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేటివ్ సమ్మిట్(ఎస్సీవో) రిసెప్షన్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని కాసేపు ముచ్చటించుకున్నారు. షరీఫ్ ఆరోగ్యం, కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 2015లో ప్రధాని మోదీ లాహోర్ వెళ్లిన సమయంలో షరీఫ్‌ను కలుసుకున్నారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు కలుసుకోవడం ఇదే ప్రథమం.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







