అంతరిక్ష గ్రహానికి మన తెలుగమ్మాయి పేరు

- June 09, 2017 , by Maagulf
అంతరిక్ష గ్రహానికి మన తెలుగమ్మాయి పేరు

బెంగళూరుకు చెందిన పింగళి సాహితికి అరుదైన గుర్తింపు దక్కనుంది. 12వ తరగతి చదువుతున్న ఆ బాలిక పేరును ఓ గ్రహానికి పెట్టాలని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిర్ణయించింది. ఇటీవల అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో నిర్వహించిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేయిర్‌లో మూడు ప్రత్యేక అవార్డులు సాధించడం.. హ్యూస్టన్‌లో ఇంటర్నేషనల్ సస్టెయనబుల్ వరల్డ్ ఇంజినీరింగ్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ ప్రాజెక్టు నిర్వహించిన ఒలింపియాడ్‌లో ఆ బాలిక బంగారు పతకం గెలుపొందడంతో ఎంఐటీ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిపై సాహితి మాట్లాడుతూ నగరంలోని చెరువుల పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడటానికి తాను చేసిన ప్రయత్నం విజయం సాధించిందని, ఈ విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలని చెప్పారు. ప్రతి విద్యార్థి చెరువుల పరిరక్షణకు కృషి చేయడంతోపాటు వాటిని దత్తతకు తీసుకోవాలని ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com