వివరాల జాబితాలో ఇసా టౌన్ పాఠశాల పని

- June 09, 2017 , by Maagulf
వివరాల జాబితాలో  ఇసా టౌన్ పాఠశాల పని

గల్ఫ్ నిధుల కార్యక్రమంలోభాగమైన ఇసా టౌన్ లో బాలుర ప్రాధమిక ఇంటర్మీడియెట్ స్కూల్ రెండవ విడత పని ప్రారంభమైంది, వర్క్స్, మున్సిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ వర్క్స్ వ్యవహారాల సహాయ కార్యదర్శి అహ్మద్ అల్ ఖయత్ తెలిపారు.ఈ ప్రాజెక్టు మొదటి దశలో, 1050 మంది విద్యార్ధులకు వసతి కల్పించేందుకు  వీలుగా నాలుగు అంతస్థుల పాఠశాల భవనం నిర్మించారు. ఇందులో    35 తరగతి గదులను గత ఏడాది పూర్తి చేశారు. విద్య మంత్రిత్వశాఖ సూచనతో,  కొత్త భవనం లోనికి  విద్యార్థులను తరలించారు. ఈ ప్రాజెక్ట్ లో సైన్స్, కంప్యూటర్, హోమ్ సైన్స్ , లైబ్రరీ కోసం బహుళ-ప్రయోజన ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు , అదేవిధంగా ఇక్కడ భోధన, కార్య నిర్వాహక అధ్యాపక కార్యాలయాలు మరియు క్రీడా ప్రాంగణకార్యాలయాలు నిర్మితమై  ఉన్నాయి. ఈ  ప్రాజెక్ట్ డిజైన్ లో భాగంగా విద్యార్థులు మరియు సిబ్బంది ప్రత్యేక అవసరాల కోసం వసతి సైతం  కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టులో స్థిరత్వం  మరియు హరిత విధానాలు భవన నిర్మాణంలో అమలు చేయబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com