'మిక్స్డ్ దాల్ కర్రీ'
- April 25, 2015
ఈ వారం ఒక పౌష్టిక జైన్ వంటకం (ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా) మీ కోసం. అదే 'మిక్స్డ్ దాల్ కర్రీ'.
కావలసిన పదార్ధాలు:
- లోబియా (బ్లాకు ఐడ్ బీన్స్) - 1 కప్పు
- చణా (బ్లాకు / వైట్) - 1/2 కప్పు
- రాజ్మా - 1/3 కప్పు
- పెసరపప్పు (గ్రీన్ కలర్) - 1/3 కప్పు
- అల్లం + పచ్చిమిర్చి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు
- టమాటో - 3
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూను
- జీలకర్ర పొడి - 1 టీ స్పూను
- పసుపు - 1/2 టీ స్పూను
- పచ్చి కారం - రుచికి సరిపడా
- చోళె మసాలా పొడి - 3 టేబుల్ స్పూన్లు
- శెనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - తగినంత
చేయు విధానం:
- ముందుగా పైన చెప్పిన పప్పులను ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం నీటిని వార్చేసి పక్కన పెట్టుకోవాలి. వండుకునేప్పుడు వీటిని ఒక ప్రెషర్ కుక్కర్ లో 3 కూతలు వచ్చేదాకా ఉడకనివ్వండి.
- ఒక బాండీలో నూనె వేసి వేడిచేయండి. ఇందులో అల్లం + పచ్చిమిర్చి ముద్దను అల్లం వాసనా పోయేదాకా వేయించండి.
- ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటోలు వేసి ఒక 5 నిమిషాలు వేయించండి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చికారం, చోళె మసాలా పొడి వేసి టొమాటోలు బాగా ఉడికేదాక వేయించండి.
- ముందుగ ఉడికించి పెట్టుకున్న పప్పులను ఇందులోకి వేసి ఒక 15 నిమిషాలు మగ్గనివ్వండి.
- ఈ కూరకి చిక్కదనం కోసం వేరే ఒక బాండీలో శెనగపిండి ని 2 నిమిషాల పాటు వేయించి నీటిలో కలపండి. ఇలా చేస్తా ఉండలు కట్టకుండా ఉంటుంది శెనగపిండి.
- ఈ శెనగపిండి కలిపిన నీటిని కూర లో కలిపి మరో 5 నిమిషాలు వేయించండి.
- కొత్తిమీర చల్లి అన్నంతో కాని రోటి తో కాని తీసుకుంటే ఎంతో బాగుంటుంది.
---- వి. జానకి జ్యోతి, కువైట్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









