సల్మాన్‌ ఖాన్‌ మరియు ప్రభుదేవా చిత్రం వచ్చేస్తోంది

- June 11, 2017 , by Maagulf
సల్మాన్‌ ఖాన్‌ మరియు ప్రభుదేవా చిత్రం వచ్చేస్తోంది

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌’, ‘దబాంగ్‌ 2’ చిత్రాలతో మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ‘దబాంగ్‌ 3’కు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారని చిత్రవర్గాల సమాచారం. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో సల్లూభాయ్‌ ఇన్‌స్పెక్టర్‌ చుల్‌బుల్‌ పాండే పాత్రలో కనిపించనున్నారు. ‘టైగర్‌ జిందా హై’ చిత్రం షూటింగ్‌ పూర్తైన తర్వాత దీని చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అమీ జాక్సన్‌ ‘దబాంగ్‌ 3’లో కథానాయికగా నటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ‘దబాంగ్‌’ తొలి రెండు భాగాల్లోనూ సోనాక్షి సిన్హా కథానాయికగా నటించారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ నటించిన ‘ట్యూబ్‌లైట్‌’ జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com