వరుస ఇఫర్లతో బిజీ గా ఉన్న ప్రియదర్శి

- June 12, 2017 , by Maagulf
వరుస ఇఫర్లతో బిజీ గా ఉన్న ప్రియదర్శి

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది పెళ్లి చూపులు. ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు ఈ సినిమా పై ప్రసంశల వర్షం కురిపించారు. సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి అప్లాజ్ లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోకి స్నేహుతుడిగా నటించి ప్రియదర్శి టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు. ప్రియదర్శి నటన ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇప్పుడు ప్రియదర్శికి మంచి ఆఫర్లు అందుతున్నాయి. తాజగా మహేష్ బాబు సినిమాలో అవకాశం అందుకున్నాడు ప్రియదర్శి. మహేష్- మురగదాస్ కలయుకలో తెరకెక్కుతున్న స్పైడర్ లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రియదర్శి.
ఇప్పుడు మరో అవకాసం దక్కింది. తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న 'కారు' లో కీలక పాత్ర దక్కించుకున్నాడు. ఈ చిత్రం లో సాయి పల్లవి, నాగ సౌర్య లు ప్రధాన పాత్రలను పోస్తిస్తున్నారు. హర్రర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com