26న ప్రధాని మోదీ– అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ
- June 12, 2017
హెచ్1బీ వీసాతోపాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
ప్రధాని మోదీ జూన్ 25, 26 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 26న శ్వేతసౌధంలో వీరిరువురూ భేటీకానున్నారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతూ భారత్ సహాపలుదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది. హెచ్1బీ వీసా నిబంధనలు, ఇతర కీలకాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 25న ప్రారంభమయ్యే ఈ పర్యటన ద్వారా భారత్–అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కానున్నాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
‘మోదీ ట్రంప్‌తో జూన్ 26న అధికారిక చర్చలు జరుపుతారు. ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్య అంశాలు ఈ భేటీలో చర్చి స్తారు’ అని ప్రకటనలో తెలిపింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు (జనవరి 20న) తీసుకున్నాక మోదీతో తొలిసారిగా సమావేశం కానుండటంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. మూడుసార్లు ఇరువురు నేతలు హాట్‌లైన్‌లో మాట్లాడుకున్నారు.
హెచ్1బీ వీసాపై అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దీనిపై భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌తో భేటీ సందర్భంగా హెచ్1బీ వీసా విషయంపై మోదీ చర్చిస్తారంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల చెప్పారు. దక్షిణాసియాలో వ్యూహా త్మక ప్రయోజనాలు, ఉగ్రవాదంపై సంయుక్తపోరు, రక్షణ సంబంధాలు, వాణిజ్య సహకారం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతోపాటుగా పలు అంతర్జాతీయ అంశాలనూ ప్రధాని లేవనెత్తే వీలుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









