హీరో విజయ్‌సేతుపతితో త్రిష ‘96’
- June 12, 2017
విజయ్‌సేతుపతితో త్రిష రొమాన్స్ చేస్తున్న 96 చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో చెన్నైలో ఆదివారం ప్రారంభం అయ్యింది. త్రిష చిత్రం ప్రారంభం అవుతుందంటే కోలీవుడ్ వర్గాల్లో కలిగే కిక్కే వేరు. అలాంటి వాతావరణమే ‘96’ చిత్ర పూజాకార్యక్రమంలో కనిపించింది. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్, విశాల్ హీరోగా కత్తిసండై వంటి భారీ చిత్రాలను నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ అధినేత ఎస్ నందగోపాల్ నిర్మిస్తున్న తాజా చిత్రం 96. అదే విధంగా పసంగ, నడువుల కొంచెం పక్కత్త కానోం, సుందరపాండియన్ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన సీ ప్రేమ్‌కుమార్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
షణ్ముగసుందరం ఛాయాగ్రహణంతోపాటు గోవింద్మీనన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం గురించి కథానాయకుడు విజయ్‌సేతుపతి మాట్లాడుతూ ఇదో అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. టైమ్ మిషన్లా చిత్రం చూసే ప్రేక్షకుల్ని వేరే లోకంలోకి తీసుకెళుతుందనే నమ్మకం ఉందన్నారు. తాను త్రిషతో కలిసి నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. తాను చిన్న నటుడిగా ఉన్నప్పుడు త్రిష ప్రముఖ కథానాయకిగా వెలుగొందుతున్నారని, ఆమె నటించిన విన్నైతాండి వరువాయా చిత్రానికి తాను ఫ్యాన్ అని అన్నారు. త్రిష, నయనతార, తమన్నాలు కఠిన శ్రమ, నటనపై అంకిత భావంతోనే ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.
విన్నైతాండివరువాయా తరువాతి చిత్రం:
నటి త్రిష మాట్లాడుతూ ‘96’ చిత్రం ఒక అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. విన్నైతాండి వరువాయా తరువాత ఆ తరహాలో సాగే విభిన్న ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ఇదన్నారు. తాను సుమారు ఏడాదిగా ఈ కథలో పయనిస్తున్నానని చెప్పారు. నాలుగేళ్లుగా చాలా చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. విజయ్ నుంచి విజయ్‌సేతుపతి వరకూ ఈ పయనం తనకు ఎంతో బాగా నచ్చిందని త్రిష పేర్కొన్నారు. ‘96’ చిత్రంలోని విజయ్‌సేతుపతి, త్రిష మధ్య కీలక సన్నివేశాలను అండమాన్‌లో చిత్రీకరించనున్నట్లు నిర్మాత ఎస్ నందగోపాల్ తెలిపారు. ఆ తరువాత కలకత్తా, రాజస్థాన్, పాండిచ్చేరి, కుంభకోణం, చెన్నై ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుపనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







