బాగ్దాద్ లో ఇఫ్తార్ వికటించి 900 మందికి అస్వస్థత..
- June 13, 2017
బాగ్ధాద్: ఇరాక్‌లో రమదాన్ మాసం సంధర్భంగా ఇచ్చిన ఇఫ్తార్ విందు వికటించి ఇద్దరు మృతి చెందగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మోసుల్ నగరంలోని క్యాంపులో చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రమదాన్ మాసం సందర్భంగా ఖతారీ హ్యూమనిరేషన్ అనే ఆర్గనైజేషన్ ఇప్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ విందులో పాల్గొన్న సుమారు 900 మంది తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు.
ఆహారం తిన్న క్యాంపు జనం వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఇఫ్తార్ విందు వికటించడం వలన డిహైడ్రేషన్ గురయ్యారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు అందుతున్నాయి. ఇప్తార్ విందులో పెట్టిన చికెన్, బీన్స్ ఆహారాన్ని ఖతారీ చారిటీ ఇర్భిల్ నగరంలోని ఓ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ట్రస్టుకు సంబంధించిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఇర్భిల్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య యుద్దం జరుగుతుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







