సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు పూర్తి

- June 14, 2017 , by Maagulf
సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు పూర్తి

 ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. సాహితీ శిఖరాన్ని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు బొగ్గులకుంటలోని సారస్వత్ పరిషత్ నుంచి సినారె అంతిమయాత్ర చేపట్టారు. అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొని సినారెకు తుది వీడ్కోలు పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com