రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం
- June 14, 2017
రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ ధీరూబాయ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ఎలాంటి వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకన్నారు. అప్పల ఊబిలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న ఆర్కామ్ను అదుకునేందుకు ఈ చర్యకు దిగారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి జీతం లేదా కమిషన్ గానీ స్వీకరించకూడదని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారని సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వ్యూహాత్మక పరివర్తన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ల బాధ్యతతో పాటు, ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో ఆర్కాం మేనేజ్మెంట్ కూడా ముందుకు సాగుతుందని తెలిపింది. సంస్థ బోర్డు సభ్యులు కూడా 21 రోజుల వేతనం వదులుకోవాలని నిర్ణయించారు. డిశెంబర్ 2017 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







