వినోదం, యాక్షన్, థ్రిల్‌తో హీరో ఆశిష్ రాజ్ రెండో చిత్రం ప్రారంభం
- June 14, 2017
ఆకతాయి చిత్రంతో ఆకట్టుకొన్న కథానాయకుడు ఆశిష్ రాజ్. తొలి సినిమాతోనే డాన్స్, యాక్షన్, నటన... ఇలా అన్ని విభాగాల్లోనూ తన ప్రతిభ చాటుకొన్నాడు. ఇప్పుడు రెండో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆకతాయి నిర్మించిన వికెఏ ఫిల్మ్స్ ఈ చిత్రాన్నీ రూపొందించనుంది. సుబ్రహ్మణ్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ముంబైకి చెందిన సిమ్రన్ ఈ చిత్రంతో కథానాయిగా పరిచయం కానుంది. ఈనెలలోనే ముహూర్తం జరుపుకొని, జులైలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్, కౌశల్, అనిల్ మాట్లాడుతూ ``ఆశిష్ రాజ్ కోసం చాలా కథలు విన్నాం. అందులో సుబ్రహ్మణ్యం చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. గ్రామీణ, పట్టణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇది. వినోదం, యాక్షన్, థ్రిల్ ఇలా అన్నింటికీ చోటుంది. బడ్జెట్ పరంగా, క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అందమైన లొకేషన్లలో పాటల్ని పూర్తి చేస్తాం. మూడు షెడ్యూళ్లలో ఈ సినిమాని పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేస్తాం. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం`` అన్నారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









