ఖైదీలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ సహకరిస్తున్న జైలు గార్డులు
- June 15, 2017
మనామా: మనదేశంలోనే కొందరు అవినీతిపరులు..పరపతి ఉన్న నేరస్థులు జైలుకి వెళ్లినా ..అన్ని వసతులు జల్సాగా పొందుతారని మనం భావిస్తాం..కానీ, కొన్ని గల్ఫ్ దేశాలలో ఈ జాడ్యం రహస్యంగా కొనసాగుతుందని అర్ధమవుతుంది...జైలులో తనిఖీ చేసే పరికరం (డిటెక్టర్లు) ఒక సాధారణ తనిఖీ సమయంలో జైలులో ఉంటున్న ఇంటి దొంగ అడ్డంగా దొరికిపోయాడు. తమ సహా ఉద్యోగి ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఉన్నత నేర న్యాయస్థానానికి తెలిపారు. పోలీసు అధికారి లోహ రేకులో మాదక ద్రవ్యాలను చుట్టి తన నడుంకు ఉన్న బెల్ట్ కింద రహస్యంగా ఆ గార్డ్ దాచాడని అయితే,తనిఖీలో ఆ మాధకద్రవ్యాల పొట్లాన్ని నిందితుని వద్ద గుర్తించి డిటెక్టర్ మోగడంతో సహచరులు అతని దుష్ప్రవర్తనను గుర్తించారు. కోర్టు పత్రాలు ప్రకారం, ముద్దాయి తన దోష నిర్ధారణ గూర్చి అంగీకరిస్తూ, తాను ఇద్దరు ఖైదీలకు డ్రగ్స్ అక్రమంగా తీసుకువెళుతున్నట్లు న్యాయవాదుల ఎదుట అంగీకరించాడు..డిటెక్టర్ తనిఖీ అనంతరం మిగిలిన గార్డులు, మాదక ద్రవ్యాలను వెలుపల నుంచి రప్పించుకొంటున్న ఆ ఖైదీలు ఉంటున్న కారాగారంకు వెళ్లారు. అక్కడ ఆ ఖైదీలకు అమరిన సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు.ఆ జైలు గదిలో ప్రపంచాన్ని సంధించే ఒక వైఫై పరికరాన్ని, సిగరెట్లను మరియు సిగేరేట్లు వెలిగించే తదితర పరికరాలను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడిన జైలుగార్డు ఈ సందర్భంగా మాట్లాడుతూ "నేను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని దాంతో 3000 బహేరిన్ దినార్లు ఇస్తామని ఆ ఖైదీలు ఆశ చూపడంతో ఆ డబ్బుకు బదులుగా వారి జైలు గదిలోనికి అక్రమంగా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తానని ఖైదీలతో అంగీకరించినట్లు తెలిపాడు. ఆయా తర్వాత తానూ జైలు వెలుపల ఒక కొత్త వ్యక్తికి 2000 బహేరిన్ దినార్లు చెల్లించి ఆ గుర్తు తెలియని వ్యక్తి నుండి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి జైలులో ఉన్న ఖైదీలకు అందించినట్లు ఆ గార్డు తెలిపాడు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









