బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్‌లో కూడా ప్రియాంక చోప్రా నెంబర్ వన్

- June 16, 2017 , by Maagulf
బాలీవుడ్ లోనే కాదు  హాలీవుడ్‌లో కూడా  ప్రియాంక చోప్రా నెంబర్ వన్

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఇష్టామైన స్టార్ స్టేటస్ సంపాదించిన యాక్టరస్ ప్రియాంక చోప్రా. ఇటీవలే రిలీజైన బేవాచ్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం, హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి నటించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. మ‌రోవైపు అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఎంతో క్రేజీ స్టార్ గా మారిపోయింది. 
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్స్ ప్లస్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో టాప్ ర్యాంకింగ్ లో కొనసాగుతుంది ప్రియాంక చోప్రా. సోషల్ మీడియా ఎనలిటిక్స్ కంపెనీ 'ఎంవీ పిండిక్స్' తాజాగా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో ప్రియాంక చోప్రా నెంబర్ వన్ పోజిషన్ లో ఉంది.  జాన్సన్ రెండో స్థానంలో ఉండ‌గా, యాక్టర్, కమెడియన్ కెవిన్ హర్ట్ 3వ ర్యాంక్ లో ఉన్నారు. ఇక‌ వండర్ ఉమెన్ స్టార్ గాల్ గాఢట్, కారా డెలివింగ్నే, విన్ డీజిల్, జెన్నిఫర్ లోపేజ్, అస్లే బెన్సన్, జాక్ ఎఫ్రాన్ వ‌రుస‌గా ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com