ఎయిరిండియా వారి ''సావాన్ స్పెషల్'' సేల్
- June 17, 2017
దేశీయ ప్యాసింజర్ క్యారియర్ ఎయిరిండియా అన్ని విమానయానసంస్థల కంటే తక్కువ ధరలకు మాన్ సూన్ సేల్ ప్రకటించింది. ఎంపికచేసిన దేశీయ రూట్లలో కేవలం 706 రూపాయలకే టిక్కెట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. ''సావాన్ స్పెషల్'' సేల్ ను మాన్ సూన్ సందర్భంగా ఎయిరిండియా తీసుకొచ్చింది. ఈ సేల్ జూన్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు మధ్యలో ప్రయాణాలకు ఈ టిక్కెట్ ధరలు వర్తిస్తాయి. ఎయిరిండియా బుకింగ్ ఆఫీసులు, www.airindia.in వెబ్ సైట్, ఎయిరిండియా మొబైల్ అప్లికేషన్, అధికారిక ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్న ఎయిరిండియా విమానాలకు ఇవి వర్తిస్తాయని తెలిపింది. ఎంపికచేసిన దేశీయ రూట్లలో వీటిని ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది.
ఎయిరిండియాకు ముందు స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ , విస్తారాలు మాన్ సూన్ సేల్ లు ప్రకటించాయి. ఈ సేల్ లో భాగంగా స్పైస్ జెట్ రూ.799కు టిక్కెట్ ధరలను విక్రయిస్తుండగా, ఇండిగో ఎంపికచేసిన రూట్లలో రూ.899కు టిక్కెట్ ను ఆఫర్ చేస్తోంది. గో ఎయిర్ రూ.899కు, విస్తారా రూ.849కు టిక్కెట్లను విక్రయిస్తోంది. విమానయాన సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ డిస్కౌంట్ ధరలతో గతేడాది కంటే ఈ ఏడాది మాన్ సూన్ ప్రయాణాలు 27 శాతం వృద్ధిని నమోదుచేశాయని ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్ క్లియర్ ట్రిప్ లో తెలిసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







