ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ విజేతగా శ్రీకాంత్
- June 18, 2017
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జపాన్ ఆటగాడు సకాయ్తో తలపడిన శ్రీకాంత్ రెండు వరుస సెట్లలో విజయం సాధించాడు. 13 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో వెనుకబడిన శ్రీకాంత్ ఆ తర్వాత తేరుకుని సుకాయ్‌పై విజృంభించాడు. దీంతో హోరాహోరీగా సాగిన రెండో సెట్‌ను శ్రీకాంత్ 21-19తో గెలిచి ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలిచాడు. శ్రీకాంత్ కెరీర్లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







