బస్సు పై చర్చ కార్యక్రమం
- October 13, 2015
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనను పురస్కరించుకుని 'మోదీ ఎక్స్ ప్రెస్' పేరుతో ఎన్నారైలు ఆదివారం బస్సు యాత్ర ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే యాత్రలో ఈ బస్సు సుప్రసిద్ధ ప్రాంతాల్లో పర్యటిస్తుంది. లిటిల్ ఇండియాగా ప్రఖ్యాతి గాంచిన వెంబ్లేలోని ఈలింగ్ రోడ్డుకు ముందుగా ఈ బస్సుయాత్ర చేరుకుంటుందని స్వాగత కమిటీ ప్రతినిధి మయూరి పర్మార్ తెలిపారు. దీపావళి నాటికి ట్రాఫల్ గర్ స్క్వేర్ కు బస్సుయాత్ర చేరుకుంటుందని చెప్పారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వచ్చే నెలలో తొలిసారిగా బ్రిటన్ కు వస్తున్న నేపథ్యంలో 'బస్సు పే చర్చ' కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబర్ 13న వెంబ్లే స్టేడియంలో మోదీకి ఒలింపిక్స్ తరహాలో స్వాగతం చెప్పనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 400 మందిపైగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







