కొత్త సినీ నిర్మాణ సంస్థలను స్థాపించబోతున్న-చరణ్
- October 13, 2015
త్వరలో రెండు కొత్త సినీ నిర్మాణ సంస్థలను స్థాపించబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెల్లడించారు. 'కొణిదెల ప్రొడక్షన్స్', 'వైట్ హార్స్ ఎంటర్టెన్మెంట్స్' పేరుతో ఇవి ఉంటాయని, నిర్మాతగా తన తొలి సినిమా తన తండ్రి చిరంజీవితో 150వ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా విషయం ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాది బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. ఇటీవలే సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కి వెళ్లి బాబాయ్ ని కలిసాను. ఇద్దరం కలిసి పని చేసే విషయాలను చర్చించాం. బాబాయ్ నిర్మించే సినిమాలో వచ్చే ఏడాది నటిస్తాను అని తెలిపారు. రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమా అక్టోబర్ 16న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబాయ్ ని సినిమా చూడటానికి ఆహ్వానించడానికే రామ్ చరణ్ వెళ్లినట్లు కూడా చెబుతున్నారు. కారణం ఏమైతేనేం... పవన్, రామ్ చరణ్ కలుసుకోవడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా విషయానికొస్తే ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బ్రూస్ లీ'. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో 'బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో 'బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది. రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్ విజయ్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







