సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే టాక్స్
- June 21, 2017
సౌదీ: సౌదీలో భార్యా బిడ్డలతో కలిసి ఉండాలంటే నెలకు 200 రియాల్స్ టాక్స్ పే చెయ్యాలి. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.3,400 పన్ను చెల్లించాలని అక్కడి గవర్నమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. ఇప్పుడు అక్కడ భారత దేశానికి చెందిన 41 లక్షల మంది వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ కొత్త చట్టంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నెలకు రూ.5,000 రియాల్స్ (రూ.85,000)జీతం వస్తున్న వారికే ఫ్యామిలీ వీసాలు ఇస్తున్నారు. 5వేల రియాల్ కంటే ఒక్క రియా తక్కువ వస్తున్నా ఫ్యామిలీ వీసాలు ఇవ్వడం లేదు. అయితే ప్రతి సంవత్సరం ఈ పన్ను 100 రియాలు పెరిగే అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రమదాన్ పండుగ సందర్బంగా సెలవులపై స్వదేశానికి చేరుకున్న భారతీయులు తిరిగి సౌదీ వెళ్లేటప్పుడు టాక్స్ భారం మోయలేక భార్యా, పిల్లలను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లడానికి సిద్దమవుతున్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







