షార్జా అగ్ని ప్రమాద బాధితుల వెతలు
- October 13, 2015
షార్జాలోని అల్ నాజర్ టవర్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంతో అందులో నివాసం ఉంటోన్నవారికి ఇప్పుడు పార్కులే ఆశ్రయాలుగా మారాయి. వేరే చోట నివాసముండటానికి తగిన మొత్తం వెచ్చించలేక, పార్కుల్లో నివాసం ఉండాల్సి వస్తోందని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతూ చెప్పాయి. అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియగానే, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని షార్జా మున్సిపాలిటీ అధికారులు చెప్పారు. ఫైర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ విభాగం సరిగా పనిచేయడంలేదని ప్రాథమిక విచారణలో తేలిందని సివిల్ డిఫెన్స్ అధికారి బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ సువాది చెప్పారు. రెడ్ క్రిసెంట్ అథారిటీ డైరెక్టర్ ఖామిస్ అల్ సువాదీ మూడు రోజుల్లోనే బాధితులకు ప్రత్యామ్నాయ నివాసాలు సమకూర్చాలనుకున్నా కొన్ని కారణాలతో అది వీలు పడలేదన్నారు. మొత్తం 150 కుటుంబాలు అగ్ని ప్రమాదంతో గూడును కోల్పోయాయి. అగ్ని ప్రమాదం సంభవించిన కారణంగా ఓనర్, నెలవారీ అద్దెను తీసుకోవడానికి వీల్లేదని, అక్టోబర్‌లో తీసుకున్న చెక్కులు తిరిగిచ్చేయాలని అధికారులు ఆదేశించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







