సబ్సిడీ ఎత్తివేతతో బహ్రెయినీలకు లబ్ది

- October 13, 2015 , by Maagulf
సబ్సిడీ ఎత్తివేతతో బహ్రెయినీలకు లబ్ది

80 శాతం మీట్‌ సబ్సిడీ పొందుతున్నవారిలో వలసవాదులు, కంపెనీలు మరియు రెస్టారెంట్లు మాత్రమేనని షౌరా కౌన్సిల్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ ఇసా అల్‌ హమ్మాది ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ప్రభుత్వ అధికార ప్రతినిథి కూడా అయిన అల్‌ హమ్మాదీ, బహ్రెయినీలకు సబ్సిడీ కొనసాగుతుందనీ, అయితే సబ్సిడీ సొమ్ము బహ్రెయినీల ఖాతాలోకి డైరెక్ట్‌గా వెళుతుందని అన్నారు. 130,000 మంది బహ్రెయినీలు మీట్‌ సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, మీట్‌ సబ్సిడీ ఎత్తివేసినప్పటినుంచీ వారి ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ మొత్తం చెల్లించబడుతుందని వివరించారు. బహ్రెయినీలకు నష్టం లేకపోవడంతో మీట్‌ సబ్సిడీ ఎత్తివేసే ఆలోచనే లేదనీ, దేశ ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ, కమర్షియల్‌ కోణంలో పక్కదారి పడుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు అల్‌ హమ్మాది. అయితే మార్కెట్‌లో అమ్మకాలు తగ్గిపోవడంతో మీట్‌ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. చాలా రెస్టారెంట్లు మీట్‌ ఉత్పత్తుల్ని మెనూలోంచి తీసేశాయి మీట్‌పై సబ్సిడీ ఎత్తివేసిన తర్వాత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com