దువ్వాడ జగన్నాథమ్ యూఎస్ ప్రీమియర్ రివ్యూ టాక్
- June 22, 2017
అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో పూజ హగ్దే హీరోయిన్ గా తెరకెక్కిన డీజే - దువ్వాడ జగన్నాథమ్ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి 2 తర్వాత తెలుగు లో వస్తున్న పెద్ద సినిమా కావడం అదికూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది కావడం తో మెగా అభిమానుల తో పాటు సినీ ప్రేక్షకులు సైతం డీజే ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మన దగ్గర ఉదయం ఆట తో డీజే హంగామా మొదలయినప్పటికీ..ఓవర్సీస్ లో మాత్రం అర్ధరాత్రి నుండే ప్రివ్యూ లతో డీజే హంగామా మొదలయ్యింది. ప్రివ్యూ టాక్ ఎలా ఉందనేది ఓ సారి చూస్తే..ఫస్ట్ హాఫ్ అంత ఫుల్ కామెడీ తో సాగిపోగా.. ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాల నుంచి అసలు కథ లోకి వస్తుందట. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు మరింతగా ఆసక్తి పెంచుందని అంటున్నారు. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో 'అగ్రిడైమండ్' లాండ్ స్కామ్‌పై అండర్ కవర్ పోలీస్‌గా బన్నీ కనిపిస్తాడని , తమవాళ్లకు సంబంధించిన భూములను లాక్కునేందుకు ప్రయత్నించిన వారిని ఏ విధంగా మట్టుపెట్టాడనేది అసలు కథట..ఇక రొయ్యల నాయుడు పాత్రలో రావు రమేష్.. తండ్రి రావుగోపాలరావును గుర్తుకు తెచ్చారని అంటున్నారు. ఇక సాంగ్స్ ల్లో బన్నీ డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అంటున్నారు.
'గుడిలో మడిలో' సాంగ్‌లో బన్నీ, పూజాహెగ్డే డాన్స్ చించేశారని. పూజా గత సినిమాలకంటే ఎంతో గ్లామర్ గా కనిపించిందని , అందాల ఆరబోతలో తానేం తక్కువ తినలేదన్నట్లు నటించిందంటున్నారు. విదేశాల్లో ఉండే ప్రధాన విలన్‌కు, పెళ్లిళ్లలో వంట చేసుకునే దువ్వాడ జగన్నాథమ్‌కు సంబంధం ఏమిటనేది ఇంట్రస్టింగ్ పాయింటని చెబుతున్నారు. బ్రాహ్మణ పాత్రలో బన్నీ నటించిన తీరుకు ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తున్నారు. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ బ్రాహ్మణ యువకుడిగా నటించి మెప్పించినట్లుగానే.. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి మంచి మార్కులే బన్నీ కొట్టేశాడని అంటున్నారు..ఇక మన తెలుగు ఆడియన్స్ ఏమంటారనేది కాసేపట్లో తెలియనుంది..పూర్తి రివ్యూ కోసం తెలుగుమిర్చి రి ఫ్రెష్ చేస్తూనే ఉండండి.
తాజా వార్తలు
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు









