మళ్లీ తెర పైకి వస్తున్నబాలయ్య నయనతార జోడి
- June 22, 2017
ఇదివరకు 'సింహా', 'శ్రీరామరాజ్యం' చిత్రాల్లో జోడీ కట్టిన నందమూరి బాలకృష్ణ, నయనతార ముచ్చటగా మూడోసారి జంటగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఈ సారి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించే సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత సి. కల్యాణ్ ధ్రువీకరించారు.
''బాలకృష్ణ సరసన ఇద్దరు నాయికలుంటారు. ఒక నాయికగా నయనతారను ఎంపిక చేశాం. కథ వినగానే నాయికగా నటించేందుకు ఆమె అంగీకరించారు. కచ్చితంగా బాలకృష్ణ, నయనతార జోడీ మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ నెలాఖరున లాంఛనంగా షూటింగ్ ప్రారంభించి, జూలై నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తాం'' అని ఆయన చెప్పారు.
ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ కథలో కె.ఎస్. రవికుమార్ శైలి వినోదంతో పాటు, సెంటిమెంట్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అంశాలు ప్రధానంగా ఉంటాయి. తొలి షెడ్యూల్‌ను తమిళనాడులోని కుంభకోణంలో నిర్వహిస్తారు. 2018 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం.
ఎం.రత్నం సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు. బాలకృష్ణతో మరో చిత్రంలో నటించడానికి నయనతార ఇటీవల తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ ఇద్దరూల మరోసారి జోడీ కడుతుండటం బాలయ్య అభిమానులను సంతోషపెడుతోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







