మోదీ బయోపిక్‌లో హీరో అక్షయ్‌కుమార్

- June 22, 2017 , by Maagulf
మోదీ బయోపిక్‌లో హీరో అక్షయ్‌కుమార్

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో అక్షయ్‌కుమార్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఇప్పటికే స్వచ్ఛ భారత్ నేపథ్యంలో తెరకెక్కుతున్న టాయ్‌లెట్-ఏక్ ప్రేమ్‌కథీ చిత్రంలో నటిస్తున్న అక్షయ్ ఈ చిత్రం గురించి మోదీని కలిసి చర్చించాడు. ఇదివరకు మోదీ బయోపిక్‌లో పరేశ్ రావల్, అనుపమ్ ఖేర్ నటించనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి.  కానీ అక్షయ్ తన చిత్రంతో మోదీ మనసు గెలిచినందున మోదీ బయోపిక్ తీస్తే అందులో అక్షయ్‌నే తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.  భాజపా ఎంపీ శతృఘ్న సిన్హా, సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ కూడా అక్షయ్‌కే ఓటేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com